కత్తి మహేష్‌‌పై అర్థరాత్రి దాడికి యత్నం...9 మంది భజరంగ్‌దల్‌, వీహెచ్‌పీ కార్యకర్తల అరెస్ట్‌

Submitted by arun on Mon, 07/02/2018 - 10:24

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. రాముడ్ని కించ పరిచే విధంగా సినిమా క్రిటిక్ కత్తి మహేశ్‌ మాట్లాడారంటూ శ్రీరామ్‌సేన, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కత్తి మహేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ భజరంగ్‌దళ్, శ్రీరాంసేన, విశ్వ హిందూ పరిషత్‌లు డిమాండ్ చేశారు.

రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని భజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలియజేసే తమను కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్‌లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అధికారులతో చర్చించారు. అయినప్పటికీ అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వదిలిపెట్టలేదు. 

English Title
Several cases filed on Kathi Mahesh across Telugu states

MORE FROM AUTHOR

RELATED ARTICLES