అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

Submitted by arun on Thu, 10/04/2018 - 11:44
South Carolina

అగ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల మోత మోగింది. ఓ ఆగంతకుడు ఏకంగా పోలీసులపైనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కరోలినా ఫ్లొరెన్స్ పరిధిలోని మిర్టల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దుండగుడి కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

English Title
Seven police officers shot in deadly South Carolina stand-off

MORE FROM AUTHOR

RELATED ARTICLES