బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రికార్డ్‌ బ్రేక్‌..మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 35 వేల మార్క్‌

Submitted by arun on Wed, 01/17/2018 - 15:26
Stock Market

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. 35 వేల మార్క్‌ను చేరుకుంది. మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా 35వేల మార్క్‌ను తాకింది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల షేర్ల అండతో లాభాల్లో పరుగులు తీస్తున్న సూచీలు సంచలనాల దిశగా సాగుతున్నాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సూచీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మార్కెట్‌ అంచనాలను పెంచుతున్నాయి. కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రోత్, ఆర్థిక వృద్ధి వేగం అందుకోబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం కావడంతో ఈ ఏడాది మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు రేపు జరగబోయే జీఎస్‌టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 
 

English Title
Sensex Hits 35,000 For First Time As Records Tumble

MORE FROM AUTHOR

RELATED ARTICLES