కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన నటి ఆమని

Submitted by nanireddy on Tue, 07/03/2018 - 20:03
senior-actress-amani-opens-about-casting-couch

ఇటీవల టాలీవుడ్ లో  కాస్టింగ్ కౌచ్ అనే వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. నటీమణి శ్రీరెడ్డి దీనిపై బోల్డ్ గా పోరాడుతున్నారు. కాస్టింగ్ కౌచ్ మరవక ముందే అమెరికాలో తెలుగు నిర్మాత దంపతులు వ్యభిచారం నిర్వహిస్తూ అమెరికా పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం  వీరిపై విచారణ  జరుగుతోంది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై పలువురు టాలీవుడ్ నటీమణులు పెదవి విరిచారు. తాజాగా  నటి  ఆమని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి వివరించారు. కాస్టింగ్ కౌచ్‌ అన్నది కొత్త అంశమేం కాదని గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయని తెలిపారు. స్వయంగా తాను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. సినిమా గురించి  అంతా మాట్లాడుకున్న తరువాత గెస్ట్‌హౌస్‌కు రమ్మనే వారు.. పైగా  మీ అమ్మను వెంట తీసుకురాకు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు ఆమని.

English Title
senior-actress-amani-opens-about-casting-couch

MORE FROM AUTHOR

RELATED ARTICLES