వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
x
Highlights

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇష్టపూర్వక శృంగారం...

వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇష్టపూర్వక శృంగారం నేరం కాదన్న సుప్రీంకోర్టు...వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగాపరిగణించడం వల్ల మహిళల సమానత్వ హక్కుకి భంగం కలుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివాహేత సంబంధం ఆత్మహత్యకు దారి తీసినప్పుడే నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 497 రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 497 ఒక పురాతన చట్టమని, అది ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. సెక్షన్ 497తోపాటు సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్ 497 మహిళల సమాన అవకాశాలను కాలరాస్తోందని వ్యాఖ్యానించింది., మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనన్న అత్యున్నత న్యాయస్థానం..పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్‌ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories