టీచర్‌తో ప్రిన్సిపల్ రాసలీలలు.. చివరకు లేడీ టీచరే..

Submitted by nanireddy on Thu, 11/08/2018 - 10:17
school-prinicipal-harassing-teacher

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపాలే అశ్లీలంగా ప్రవర్తించాడు. గుజరాత్‌లో  టీచర్ తో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రిన్సిపల్‌. ఏకంగా స్కూల్లోనే రాసలీలలతో సీసీ కెమెరాకు చిక్కాడు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు లేని సమయంలో టీచర్‌ను అసభ్యంగా తాకుతూ.. ఆమెతో సరసాలు ఆడాడు. ఈ ఘటన దహోద్‌ జిల్లాలోని భమన్‌ గ్రామంలోని హైస్కూల్ లో వెలుగుచూసింది. ఇటీవల  ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడే పనిచేసే లేడీ టీచర్ ను కొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను ముద్దుపెట్టుకున్నట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే అది కాస్త బయటికి రావడంతో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దాంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై  సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు. ఇదిలావుంటే ఈ ఘటనపై సదరు లేడీ టీచర్ స్పందించారు. తనను బెదిరించి ముద్దుపెట్టుకున్నట్టు ఆమె చెప్పారు. గతంలోనూ అతను ఇలాగే అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అతని చేతిలో తాను అత్యాచారానికి కూడా గురయ్యానన్నారు. ఐతే.. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించడంతోనే ఇన్నాళ్లా ఏమి చేయలేకపోయానని.. ఇప్పుడు భర్త తనను అర్థం చేసుకుని, ధైర్యం చెప్పడంతో ప్రిన్సిపల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

English Title
school-prinicipal-harassing-teacher

MORE FROM AUTHOR

RELATED ARTICLES