బండ్ల గణేష్‌పై అట్రాసిటీ కేసు నమోదు

Submitted by arun on Thu, 01/11/2018 - 12:38
bandla ganesh

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, అతని సోదరుడు శివబాబుల పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఏసీపీ సురేందర్ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో పౌల్ట్రీ ఫామ్ లు, భూములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న ఈ పౌల్ట్రీ ఫామ్‌లను ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

అయితే బ్యాంక్ ఇచ్చిన గడువులోగా రుణాలను గణేష్‌ తిరిగి చెల్లించకపోవటంతో ఆ పౌల్ట్రీ ఫామ్‌లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేసి, వారి ద్వారానే ఆ ఆస్తులను సీజ్ చేశారు. తరువాత తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్‌ పౌల్ట్రీ ఫామ్‌ ఆఫీసుకు వెళ్లారు. ఆసమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది.
 

English Title
sc st case filed on bandla ganesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES