మడకశిర ఎమ్మెల్యేకు సుప్రీంలోనూ ఎదురుదెబ్బ

మడకశిర ఎమ్మెల్యేకు సుప్రీంలోనూ ఎదురుదెబ్బ
x
Highlights

అనంతపురం జిల్లా మడకశిర తెదేపా ఎమ్మెల్యే కె.ఈరన్నకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ...

అనంతపురం జిల్లా మడకశిర తెదేపా ఎమ్మెల్యే కె.ఈరన్నకు సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈరన్న ఎన్నిక చెల్లదని గతంలో హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆ స్థానంలో రెండో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని ధర్మాసనం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories