సంచలన నిర్ణయం తీసుకున్న SBI

Submitted by nanireddy on Tue, 10/02/2018 - 16:08
sbi-cuts-atm-cash-withdrawal-limit-to-rs-20000-per-day

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్బిఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎటిఎం విత్ డ్రా నుంచి రోజుకు రూ.40వేలు కాకుండా   20 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా నిబంధనను మార్చింది. అయితే ఇది ఎంపిక చేసిన ఎస్బిఐ కార్డులకు మాత్రమే వర్తిస్తుందని ఎస్బిఐ అంటోంది. ఇప్పటికే వాడుకలో ఉన్న ‘క్లాసిక్’ మరియు ‘మాస్ట్రో’ డెబిట్ కార్డులకు వర్తించనుంది. కొత్త పరిమితి అక్టోబర్ 31 నుండి అమలులోకి వస్తుందని సమాచారం. ATMల వద్ద మోసపూరిత లావాదేవీల గురించి బ్యాంకులు అందుకున్న ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడం, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి కారణాలతో ఈ చర్యను చేపట్టింది. ATMs మోసపూరిత లావాదేవీలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు సంబంధిత బ్రాంచ్ లను ఆశ్రయిస్తున్నారు. దాంతో బ్యాంకులు ఈతరహా ఫిర్యాదులతో ఇబ్బందులో ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ నగదు లావాదేవీలను ప్రోత్సహించే దిశగా వివిధ బ్యాంకులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎస్బిఐ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ విషయాన్నీ ఎస్బిఐ కస్టమర్లకు తెలియజేయాలని అన్ని ఎస్బిఐ శాఖలకు సూచించింది. 

English Title
sbi-cuts-atm-cash-withdrawal-limit-to-rs-20000-per-day

MORE FROM AUTHOR

RELATED ARTICLES