త‌ల్లిని ప్రేమించ‌లేని భర్తతో క‌లిసుండ‌లేను

Submitted by lakshman on Sun, 01/14/2018 - 16:17
 woman divorces

త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌లేనంటూ ఓ మ‌హిళ సంచ‌ల‌నం సృష్టించింది. అందులో సంచ‌ల‌నం ఏముంది అంటారా. కామ‌న్ గా భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య  మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో క‌లిసి ఉండ‌డం ఇష్టంలేక విడాకులు కోరుకుంటారు. కానీ సౌదీకి చెందిన ఓ మ‌హిళ  తల్లిని ప్రేమించలేని వాడి ప్రేమను నమ్మలేనంటూ త‌న భ‌ర్త నుంచి విడాకులు ఇప్పించండ‌ని కోర్టును ఆశ్ర‌యించింది. దీంతో మ‌హిళ అభ్య‌ర్ధ‌న‌కు ఆశ్చ‌ర్య‌పోయిన న్యాయవాదులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 

నా భ‌ర్త నేను ఏం కోరితే అది క్ష‌ణాల్లో తెచ్చి ఇచ్చే వాడు. కార్లలో తిప్పేవాడు. విదేశాల‌కు తీసుకెళ్లేవాడు. ఖ‌రీదైన హోట‌ళ్ల‌లో పార్టీ ఇప్పించేవాడు. ఇన్ని చేసిన భ‌ర్త అత‌ని త‌ల్లిని మాత్రం చూసుకునేవాడు కాద‌ని ...ఆమె అడిగిన చిన్న‌చిన్న కోరిక‌ల తీర్చ‌లేద‌ని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. త‌న త‌ల్లిని ప్రేమిచ‌లేని వాడిని ఎలా న‌మ్మాలి. రేపు మ‌రో అమ్మాయి వెంట‌ప‌డ‌డ‌ని గ్యారంటీ ఏమిటీ అందుకే నాకు విడాకులు ఇప్పించ‌డ‌ని పిటిష‌న్ లో పేర్కొంది. ఆ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయస్థానం  ఓ అమ్మాయి కోసం కన్నతల్లినే మరచిపోయినవాడిని ఎప్పటికీ నమ్మలేం అంటూ విడాకులు మంజూరు చేసింది. మ‌న‌కు జ‌న్మ‌నిచ్చిన అమ్మ‌కు మ‌రెవ్వు సాటిరారు. ‘తల్లిని ప్రేమించనివాడు..భార్యపై చూపేది కపట ప్రేమే’ అని మహిళను అభినందించారు. 

English Title
Saudi woman divorces husband who loved her more than his mother

MORE FROM AUTHOR

RELATED ARTICLES