నామినేషన్ వేస్తే 40 లక్షల జరిమానా

Submitted by arun on Thu, 06/21/2018 - 12:13

పంచాయితీ ఎన్నికలకు కనీసం షెడ్యూల్ కూడా విడుదల కాలేదు కానీ పల్లెల్లో అప్పుడే వేడి రాజుకుంటుంది. సర్పంచ్ ఎవరనేదానిపై అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. ఓటుకింత రేటు కట్టి ఓటర్లను గంపగుత్తగా కొనేస్తున్నారు. ఈ మధ్యే పంచాయితీగా మారిన నల్లగొండ జిల్లా గున్యా తండాలో సర్పంచ్, వార్డు మెంబర్లలన్నింటీని ఒక్కపెట్టున కొనేశారన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. 

నల్లగొండ జిల్లా అడవిదేవుల పల్లి మండలం గున్యా తండా. ఈ మధ్యే దీన్ని తండా నుంచి పంచాయతీ స్థాయికి పెంచారు. ఓటర్ల 630 మంది ఉండగా అప్పుడే ఊళ్లో పంచాయితీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది. అయితే సర్పంచ్, ఇతర పదవులకు వేలం వేశారనే ఆరోపణలతో గున్యా తండా జిల్లాలోనే కలకలం సృష్టిస్తోంది. 

ఊరిపై పట్టుకున్న అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి.. సర్పంచ్, ఇతర పదవులను గంపగుత్తగా కొనేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ కోసం జరిగిన వేలంలో గెలిచిన సదరు వ్యక్తి.. మొత్తం 20 లక్షలకు సదరు వ్యక్తి.. బేరం కుదుర్చుకున్నట్లు.. తెలుస్తోంది. అంతేకాకుండా.. తనకు నచ్చిన వారే ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను నియమించుకునేలా తీర్మానం కూడా చేసినట్లు.. ప్రచారం జరుగుతోంది. ఇటు ఈ వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన ఇతరులకు ఎంతో కొంత నగదు ముట్టజెప్పారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 630 ఓట్లకు గానూ.. ఒక్కో ఓటుకు 3 వేల పైచిలుకు విలువ కట్టారు. దీనికి గ్రామ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇకపై పంచాయితీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయరాదని.. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేస్తే.. 40 లక్షల రూపాయల జరిమానా విధించాలని.. గ్రామస్తుల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. 

అడవిదేవుల పల్లి మండలంలోని పలు పంచాయితీల్లో సర్పంచి పదవికి చాలామంది ఆశావహులు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా వచ్చే యేడాదిలో సాధారణ ఎన్నికలుండటం గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుండటంతో.. తండాలపై ఇప్పటి నుంచే పట్టుసాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గున్యా తండాలో సర్పంచ్ వేలం విషయం.. జిల్లాలోనే సంచలనంగా మారింది. 

English Title
sarpanch election

MORE FROM AUTHOR

RELATED ARTICLES