బిగ్‌బాస్-2లో తొలి రోజే రాజుకున్న వేడి.. సెలబ్రిటీలపై విరుచుకుపడిన సంజన!

Submitted by arun on Mon, 06/11/2018 - 10:42
bigboss

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా స్టార్ మా టీవీలో బిగ్‌బాస్-2 షో ప్రారంభమైంది. మొత్తం 16 మందిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపగా, అందులో 13 మంది సెలబ్రిటీలే ఉన్నారు. మిగతా ముగ్గురు సామాన్యులు. వీరిలో విజయవాడకు చెందిన మోడల్ సంజన అన్నె, గణేశ్, విశాఖపట్టణానికి చెందిన నూతన్ నాయుడు ఉన్నారు.  అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో తొలిరోజే సామాన్యులకు సెలబ్రిటీలు షాక్‌ ఇచ్చారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌లో బిగ్‌బాస్‌ ఇంటినుంచి బయటకు పంపేందుకు ఇద్దరిని ఎన్నుకోవాలని ఆదేశించారు. దీంతో తొలిరోజే కంటెస్టంట్లకు ఊహించని షాక్ ఎదురైనట్లు అయ్యింది. అయితే సెలబ్రెటీలు అందరూ మూకుమ్మడిగా సామాన్యుల నుంచి కంటెస్టెంట్‌లుగా వచ్చిన సంజనా, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు. బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు ఇద్దరిని హౌజ్‌లో ఉన్న జైల్లో పెట్టి తాళం వేశారు. సోమవారం ఎపిసోడ్‌లో ఒకరిని బయటకు విడుదల చేసే అవకాశం ఉండటంతో ఆ ఒకరు ఎవరన్నది ఆసక్తిగా మారింది. దీంతో అసలు చిచ్చు రాజుకుంది. అంత మంది సెలబ్రిటీల్లోనూ సామాన్యులుగా వచ్చిన తమ పేర్లనే సూచిండం పట్ల మోడల్ సంజనా ఫైర్ అయ్యారు.

English Title
sanjana anne and nutan naidu are first day elimination bigboss

MORE FROM AUTHOR

RELATED ARTICLES