మళ్లీ మొదటికి వచ్చిన సంగీత వివాదం

Submitted by arun on Fri, 02/02/2018 - 18:48
Srinivas reddy, Sangeetha

సంగీత వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. భర్త వేధింపులు, అత్తింటివారు బయటకు గెంటివేయడంతో బోడుప్పల్‌లో రెండు నెలల పాటు పోరాటం చేసి కోర్టు అనుమతితో సంగీత ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వివాదం రాజుకుంది. అత్తింటివారు సంగీతను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టి గేటుకు తాళం వేసుకున్నారు. దీంతో మళ్లీ సంగీత రోడ్డున పడింది.
 
మేడ్చేల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన శ్రీనివాస రెడ్డి మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్నాడు. చందానగర్‌కు చెందిన సంగీతతో శ్రీనివాస్ రెడ్డికి నాలగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి రెండేళ్ల పాప కూడా ఉంది. భర్త రెండో పెళ్లి గురించి ప్రశ్నించడానికి ఇంటికి వెళ్తే ఆమెపై దాడి చేశాడు. బంధువులంతా చూస్తుండగానే సంగీతను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు. దన్ని అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్‌ో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చశారు. ఆడపిల్ల పుట్టినందుకే తనన ఇంటి నుంచి గెంటేసినట్లు సంగీత ఆరోపించారు.

దాంతో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్‌లోని సరస్వతీనగర్ కాలనీలో సంగీత భర్త ఇంటి ముందు దీక్షకు చేపట్టింది. దాదాపు రెండు నెలల పాటు ఆమె దీక్ష చేసింది. ఆమెకు ప్రజా సంఘాల కార్యకర్తలు, రాజకీయ నేతలు మద్దతు ప్రకటంచారు. ఆ క్రమంలోనే కోర్టు కేసు నడిచింది. సంగీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఆమె తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి, తదితరులకు బెయిల్ మంజూరైంది. అయితే, సంగీతను శుక్రవారంనాడు అత్తింటివారు మళ్లీ బయటకు గెంటేసి తాళం వేశారు. దాంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.

English Title
sangeetha again thrown of the house

MORE FROM AUTHOR

RELATED ARTICLES