వార్డెన్‌ అరాచకం

Submitted by arun on Mon, 01/08/2018 - 14:15

విద్యార్ధులను క్రమశిక్షణలో పెట్టాల్సిన వార్డెన్‌ క్రమం తప్పాడు. చిన్న తప్పుకే పెద్ద శిక్షలు విధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. ప్లాస్టిక్‌ పైపుతో విద్యార్ధులను చితకబాదుతూ నరకం చూపించాడు. బండ బూతులు తిడుతూ విద్యార్ధులను గోడ కుర్చీ వేయించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎస్టీ హాస్టల్‌ వార్డెన్‌ యాదయ్య అరాచకంతో పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. చేతులు నొప్పి పెడుతున్నాయి, కొట్టొద్దు సార్‌ అని వేడుకున్నా వదిలిపెట్టకపోవడంతో విద్యార్ధులు అల్లాడిపోయారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ గిరిజన హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు వాషింగ్‌ బ్రెష్‌ విషయంలో గొడవపడ్డారు. నాదంటే నాదని నెట్టుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి వార్డెన్‌ దగ్గరికి వెళ్లగా విద్యార్ధులను యాదయ్య చితకబాదాడు. ప్లాస్టిక్‌ పైపుతో కొడుతూ బండ బూతులు తిట్టాడు. గోడకు తలకిందులుగా నిలబెట్టి నరకం చూపించాడు. వార్డెన్‌ అరాచకాన్ని తట్టుకోలేక చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు.

English Title
sangareddy warden punishment to students

MORE FROM AUTHOR

RELATED ARTICLES