శాంసంగ్ గెలాక్సీ నోట్ 8తో పారా హుషార్

Submitted by arun on Sun, 12/31/2017 - 17:16
Samsung Galaxy Note 8

సెప్టెంబ‌ర్ 12న శాంసంగ్ కంపెనీ  స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోటీ 8 ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక వైర్‌లెస్‌ చార్జర్‌ ఉచితం. వన్‌టైం స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌  ఉచితం. హెచ్‌డీఎఫ్‌సీ  వినియోగదారులకు రూ.4వేల క్యాఫ్‌బ్యాక్‌ ఆపర్‌ ను అందించింది. అయితే ప్రారంభం నాటికే  రిజిస్ట్రేషన్ల సంఖ్య 6 లక్షల 50వేలను  దాటేసిందని  ఆ కంపెనీ వెల్ల‌డించింది. కానీ రెండు నెల‌ల త‌రువాత ప‌రిస్థితి మారింది. శాంసంగ్ నోట్ 8 అంటే స్మార్ట్ ప్రియులు పారిపోతున్నారు. దానికి కార‌ణం శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫోన్లలో సాంకేతిక సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్, ముబైల్ ఆన్ చేసే విష‌యంలో వినియోగ‌దారులు సంతృప్తిగా లేర‌ని మొబైల్ షాపు నిర్వాహ‌కులు అంటున్నారు. దీంతో స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో వినియోగదారులు  సేవా కేంద్రాలకు పరిగెడుతున్నారు. దీనిపై స్పందించిన  శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి  శాంసంగ్ ఫోన్ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు సేవాకేంద్రాల‌కు వెళ్లాల‌ని.. ఈ సమస్యపై కంపెనీ అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

English Title
Samsung Galaxy Note 8 Charging Problems

MORE FROM AUTHOR

RELATED ARTICLES