సంపూ సినిమాకు రూ.233.64 కోట్లా!

Submitted by nanireddy on Wed, 05/09/2018 - 15:59
sampoornesh-babu-kobbari-matta-new-poster-gone-viral

సంపూర్ణేష్ బాబు ఈ పేరు వినగానే ముందుగా గుర్తకు వచ్చేది అయన హీరోగా చేసిన హృదయ కాలేయం.. లాజిక్ లేని మాటలు, అసందర్భ కధనంతో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో రాత్రికి రాత్రే బర్నింగ్ స్టార్ అయిపోయాడు సంపూ. ఆ తరువాత సింగం 123 వంటి సినిమా చేసి తనలోని నటనా పరిపక్వతను మరింత పెంచుకున్నాడు. అయితే ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభమైన తన  'కొబ్బరి మట్ట' చిత్రం ఇప్పటికి రిలీజ్ కాలేదు. అందరూ అనుకోవచ్చు సినిమా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటుందని.. కానీ అలాంటిది ఏమి లేదు ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా రీలీజ్ వాయిదా పడింది. దీనికి కారణం నిర్మాతలేనట.. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ కష్టాలు తీరాయి అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అందుకోసం బర్నింగ్ స్టార్ బర్త్ డే సందర్బంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సినిమా రిలీజ్ కాకుండానే రూ.233.64 కోట్ల రూపాయలు కలెక్షన్లు ఆశిస్తున్నట్టు రాశారు.. అంటే సినిమా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్  బాబుది కదా ఆ మాత్రం అంచనాలు లేకపోతే ఎలా మరి.?

English Title
sampoornesh-babu-kobbari-matta-new-poster-gone-viral

MORE FROM AUTHOR

RELATED ARTICLES