మెడ‌పై క‌త్తిపెట్టి షాకిచ్చిన స‌మంత

Submitted by arun on Thu, 01/04/2018 - 15:53

అక్కినేని స‌మంత క‌త్తిప‌ట్టుకొని పీక‌ను కోసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నాలు వ‌ర్కౌట్ అవుతాయో లేదో ఏప్రిల్ 27న వ‌ర‌కు ఆగాల్సిందే. ఓ వైపు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా దూసుకుపోతున్న స‌మంత మూసదోరిణిలా కాకుండా సినిమాల్లో కొత్త‌ద‌నం కోరుకుంటుంది. అందుకే కాబోలు సూప‌ర్ డీల‌క్స్ అనే ప్ర‌యోగాత్మ‌క‌మైన సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో స‌మంత క్యార‌క్ట‌ర్ ఇలా ఉండ‌బోతుందంటూ టీజ‌ర్ ను విడుద‌ల చేసి షాకిచ్చింది చిత్ర‌యూనిట్. కోలీవుడ్ థియాగ‌రాజ‌న్ కుమార‌రాజా డైర‌క్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో స‌మంత‌ మద్యంమ‌త్తులో ఉన్న అప‌రిచితుడి మెడ‌పై చికెన్ ముక్క‌పెట్టి ప‌దునైన క‌త్తితో న‌రికేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇప్పుడా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. టీజ‌ర్ లో ఇంత వెరైటీ గా ఉన్న స‌మంత పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆమె అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇక సినిమాలో సమంతతో పాటు విజయ్ సేతుపతి - ఫహాధ్ ఫసిల్ అలాగే రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
 

English Title
Samantha Super Deluxe Teaser

MORE FROM AUTHOR

RELATED ARTICLES