అది నిజం ముద్దు కాదు...

Submitted by arun on Wed, 04/11/2018 - 11:43
Samantha

రామ్ చరణ్, సమంతల కామినేషన్లో వచ్చిన 'రంగస్థలం' మూవీ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఓ చుంబన దృశ్యం ఉంది. ఈ ముద్దు సీన్ పై తాజాగా ఓ మీడియా సంస్థలో సమంత స్పందించింది. వాస్తవానికి అది నిజమైన ముద్దు కాదని తెలిపింది. చరణ్ బుగ్గపై తాను ముద్దు పెట్టానని... దాన్ని ఒక కెమెరా ట్రిక్కుతో లిప్ లాక్ లా భ్రమించేలా తీశారని చెప్పింది. కథకి ఆ సన్నివేశం అవసరం కాబట్టే అలా చిత్రీకరించాల్సి వచ్చిందని తెలిపింది. నేను ఓ నటిని. సన్నివేశానికి తగినట్టుగా నటించాలి. పెళ్లయిన కథానాయికని ‘లిప్‌ లాక్‌ ఎందుకు చేశారు’ అని అడిగినట్టు.. పెళ్లయిన కథానాయకుల్ని అడగరెందుకని? ‘సన్నివేశం ఇది..’ అని దర్శకుడు చెప్పారు. ‘ముద్దు సన్నివేశం మీకు ఇష్టం ఉంటేనే.. లేదంటే లేదు’ అన్నారు. ‘ఇక్కడో లిప్‌ లాక్‌ పెడితే.. ఓ పది నేల టికెట్లు తెగుతాయ్‌’ అనుకునే మనస్తత్వం సుకుమార్‌కి లేదు. కథకి, ఆ సన్నివేశానికి అవసరం కాబట్టే ఆ సన్నివేశం చిత్రీకరించాల్సివచ్చిందిని తెలిపింది

ఇటీవలే తాను, చైతూ అమెరికా వెళ్లొచ్చామని... 'రంగస్థలం' విడుదలకు ముందు ఉండే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వెళ్లామని సమంత చెప్పింది. ఇకపై ఆదివారాలు షూటింగ్ లకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని... అక్కినేని ఫ్యామిలీలో ఆదివారాలు ఎవరూ షూటింగ్ లకు వెళ్లరని... తాను కూడా అంతేనని తెలిపింది.
 

English Title
Samantha responds about liplock in Rangasthalam

MORE FROM AUTHOR

RELATED ARTICLES