గొంతు ఇన్ఫెక్షన్ ఉందా.. అయితే ఇలా చేయండి..

Submitted by nanireddy on Sat, 10/06/2018 - 19:14
salt-health-benefits-for-the-sore-throat

గత రెండు వారాలుగా సిటీల్లోని కొందరు గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇది సాధారణంగా వర్షాకాలంలో వస్తుంది. అలాగే వాతావరణంలో సమూల మార్పులు సంభవించినపుడు వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వున్నప్పుడు ఎక్కువగా వస్తుంది. కొన్ని సార్లు కారణం ఏమీ లేకపోయినా గొంతు నొప్పి బాధిస్తుంది. దీని లక్షణాలు మాట బొంగురు పోవడం, మాట్లాడుతుంటే నొప్పిగా ఉండడం, మింగలేకపోవడం వంటివి. దీంతోపాటు కొందరికి జ్వరం, దగ్గు వంటివి కూడా ఉంటాయి. అయితే ఈ సమస్యకు డాక్టర్ సలహాతోపాటు కొన్ని చిట్కాలు కూడా పాటించాలని అంటున్నారు నిపుణులు. అది ముఖ్యంగా గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని మూడుపూటలా పుక్కిలిస్తే కొంత ఉపశమనం ఉంటుంది. గొంతులోకి వెళ్లిన ఉప్పు నీరు కఫాన్ని తగ్గిస్తుంది. దాంతోపాటు ఇన్‌ఫెక్షన్లను దరి చేరనీయదు. అలాగే స్పూన్ అల్లం తురుమును కప్పు నీటిలో మరిగించి వడకట్టాలి. దీనికి స్పూన్ తేనె కలిపి వేడిగా తీసుకుంటే తక్షణ ఉపశమనం ఉంటుంది. ఇలా మూడు పూటలు తీసుకుంటే నొప్పి పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుముఖం పడుతుంది. వీటితోపాటుగా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే కూడా దగ్గు, జలుబు సమస్యలు సైతం దూరమవుతాయి.

English Title
salt-health-benefits-for-the-sore-throat

MORE FROM AUTHOR

RELATED ARTICLES