నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్‌

Submitted by arun on Tue, 02/06/2018 - 14:07
Salman Khan

యాభై ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖానే. సల్మాన్ కు సంబంధించిన ఎలాంటి చిన్న వార్త అయినా పతాక శీర్షికల్లోనే ఉంటుంది. తాజాగా ఓ ట్వీట్ ద్వారా సల్మన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. 'నాకు ఒక అమ్మాయి దొరికింది' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సల్మాన్ పెళ్లికి సంబంధించిందేనా? అనే ఆసక్తి ఇప్పుడు అందర్లో నెలకొంది.
కొంత కాలంగా లులియా వాంటూర్‌ తో సన్నిహితంగా ఉంటున్న సల్మాన్ ఇటీవల ఆమెకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి. లులియా కూడా సల్మాన్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ కామెంట్ చేయటంతో వారిద్దరు దూరమయ్యారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌. ఇప్పుడు సల్మాన్‌ ట్వీట్ తో మరోసారి సల్మాన్‌ పెళ్లి వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల టైగర్‌ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం రేస్‌ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English Title
Salman Khan's "Mujhe Ladki Mil Gayi" Tweet

MORE FROM AUTHOR

RELATED ARTICLES