సల్మాన్ గాళ్ ఫ్రెండ్ లులియాకు కత్రినా చెక్

సల్మాన్ గాళ్ ఫ్రెండ్ లులియాకు కత్రినా చెక్
x
Highlights

సల్మాన్ ఖాన్ లవ్ ఎఫైర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. టైగర్ జిందా హై మూవీతో సల్మాన్, కత్రినా కైఫ్ మధ్య మళ్లీ చనువు పెరిగిపోయింది. దీంతో ఇద్దరి మధ్య...

సల్మాన్ ఖాన్ లవ్ ఎఫైర్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. టైగర్ జిందా హై మూవీతో సల్మాన్, కత్రినా కైఫ్ మధ్య మళ్లీ చనువు పెరిగిపోయింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజం అయితే..సల్మాన్ ఖాన్ రుమేనియా గాళ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి..

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఒకప్పటి మాజీ ప్రేమికులు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మనస్పర్ధాలతో విడిపోయారు. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కత్రినా,రణ్ వీర్ తో లవ్ లోపడితే, సల్మాన్ ఏమో రుమేనియా భామ లులియా వంటూర్ తో లవ్ లో పడ్డాడు. ఏకంగా తెల్ల తోలు భామను ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంత వరకు భాగానే ఉంది. కానీ టైగర్ జిందా హై మూవీతో కథ మారిపోయింది.

టైగర్ జిందా హై మూవీలో మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమాతో ఇద్దరి మధ్య చనువు పెరిగి మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చిందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో సల్లు భాయ్ నారి నారి నడుమ మురారిలో మారిపోయాడు. ఓ వైపు కత్రినా మరోవైపు రుమేనియా భామ. ఈ ఇద్దరిలో సల్మాన్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడోననే ప్రచారం జరుగుతోంది.

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ రిలేషన్ షిప్ గురించి, సల్లు భాయ్ ప్రజెంట్ గాళ్ ఫ్రెండ్ లులియా వద్ద ప్రస్తావించగా తేలిగ్గా కొట్టిపారేసింది. కలిసి సినిమా చేసినంత మాత్రానా అలాంటి రూమర్స్ చేయడం తగదని తేల్చిచెప్పింది. అలాంటివి పెద్దగా పట్టించుకోని సమాధానం చెప్పింది. సల్మాన్ ఖాన్ జయహో మూవీకి సింగర్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన లులియా, సల్లు భాయ్ ని వలలో వేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయింది. ప్రజెంట్ మ్యూజిక్ ఆల్పమ్స్ చేస్తోంది. పెళ్లి చేసుకుంటారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories