సిక్కుల ఊచకోతలో సజ్జన్‌ పాత్ర ఏంటి?

సిక్కుల ఊచకోతలో సజ్జన్‌ పాత్ర ఏంటి?
x
Highlights

న్యాయం జరగడంలో ఆలస్యం కావచ్చు...కానీ న్యాయం జరగడం ఖాయం. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోత కేసులో, ఢిల్లీ హైకోర్టు తీర్పు పట్ల,...

న్యాయం జరగడంలో ఆలస్యం కావచ్చు...కానీ న్యాయం జరగడం ఖాయం. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోత కేసులో, ఢిల్లీ హైకోర్టు తీర్పు పట్ల, ఇప్పుడు బాధితులంతా ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. సిక్కుల హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, సజ్జన్‌ కుమార్‌కు జీవితకాల శిక్ష విధిస్తూ, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల, సిక్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు నిందితులపై పార్టీ పరంగా చర్యలేంటని బీజేపీతో పాటు పలు పార్టీలు, కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటే, కాంగ్రెస్ మాత్రం ఎదురుదాడి చేస్తోంది.

34 ఏళ్ల పోరాటం. దోషులను బోనెక్కించాల్సిందేనన్న ధర్మపోరాటం. కొడుకును కోల్పోయిన ఒక అమ్మ, తండ్రిని పోగొట్టుకున్న ఒక బిడ్డ, భర్తను దూరం చేసుకున్న ఒక భార్య...సొంతమనుకున్నవారిని కోల్పోయిన బంధువులు....ఇలా వీరందరూ మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా గళం వినిపించారు. పోరాటానికిప్పుడు న్యాయం జరిగడం ప్రారంభమైందని, అందులో ఒక అడుగు పడిందని వాళ్లందరూ సంతోషపడుతున్నారు.
చేసిన పాపం ఊరికే పోదు. ఏదో ఒక రోజు ఆ పాపం పండకపోదు. న్యాయం ఆలస్యమైనా, న్యాయం మాత్రం జరుగుతుంది. ఇలాంటి నిరీక్షణతోనే, సిక్కులు కొన్ని దశాబ్దాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. అకారణంగా, అన్యాయంగా, అత్యంత పాశవిశకంగా, రాక్షసంగా తమవారిని పొట్టనపెట్టుకున్నవారిని, బోనెక్కించాలని పోరాడుతూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు న్యాయం జరగడంలో ఒక అడుగు పడిందని, సంబరాలు చేసుకుంటున్నారు.

సిక్కుల సంబరాలకు, న్యాయం గెలిచిందన్న ఆనందాలకు కారణమేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.అవును....1984 సిక్కుల ఊచకోత కేసులో, ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌కు జీవితకాల శిక్ష విధించింది. అందుకే న్యాయం గెలిచిందన్న సిక్కుల హర్షాతిరేకాలు.
సజ్జన్ కుమార్ ఈ కేసులో నిర్దోషి అని కిందికోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఆయనకు జీవితకాల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు. నాడు సిక్కుల ఊచకోతకు సంబంధించి కింది కోర్టు కుట్రకోణంను విస్మరించిందని స్పష్టం చేసింది. 1984లో జరిగిన అల్లర్లను పరిశీలిస్తే మానవత్వంపై జరిగిన దాడిగా చూడాల్సి ఉందని జడ్జీలు అభిప్రాయపడ్డారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని బాధితులు గుర్తించాలని జడ్జీలు చెప్పారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ, ఆమ్‌ఆద్మీ, అకాలీదళ్‌ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సజ్జన్‌ కుమార్‌‌ను బహిష్కరిస్తుందా?....జగదీశ్‌ టైట్లర్‌పై వేటేస్తుందా? అంటూ డిమాండ్‌ చేస్తోంది. అలాగే సిక్కుల ఊచకోత కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కమల్‌నాథ్‌కు, మధ్యప్రదేశ్‌ సీఎంగా, కాంగ్రెస్ రివార్డ్ ఇచ్చిందని కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తోంది బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories