శర్వాతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి!

Submitted by arun on Wed, 08/01/2018 - 15:57
Sai Pallavi

తెలుగు సినీ రంగంలో హీరోయిన్ సాయి పల్లవి కి హిట్స్ అయితే వస్తున్నాయి కానీ అంతకు మించి వివాదాలు కూడా పుడుతున్నాయి. అంతకుముందు ఆమె హీరోయిన్ గా నటించిన హీరోలు నాగ శౌర్య, నాని లతో విభేదాలు వచ్చాయని రూమర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో హీరో శర్వానంద్‌తో కూడా అదే పరిస్థితి ఉందని సోషల్ మీడియా కోడై కూసింది. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి. అయితే శర్వా, సాయిపల్లవికి మధ్య గొడవ కావటంతో షూటింగ్‌ కు బ్రేక్‌ పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వటంపై స్పందించారు. ‘శర్వానంద్‌, పడి పడి లేచే మనసు సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవ’ని ఆమె క్లారిటీ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు డిసెంబర్‌ 21న రిలీజ్ కానుంది.
 

English Title
sai-pallavi-gave-clarity-rumours

MORE FROM AUTHOR

RELATED ARTICLES