వరల్డ్ వైడ్ ట్రెండింగ్ : పాపం అప్పుడు అలా..ఇప్పుడు ఇలా

Submitted by admin on Tue, 12/12/2017 - 17:19

ఎవరైనా నువ్వు హీరోలా ఉన్నావంటే చాలు మనంతపోటుగాడు లేడని ఊహల్లో విహరిస్తాం. మరికొంతమంది గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. మీరో పలానా హీరోలా ఉన్నారే, మీరు పలానా హీరోయిన్ లా ఉన్నారంటే చాలు  తాము అభిమానించే హీరోను, హీరోయిన్ గురించి అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కోసారి ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇరాన్ కు చెందిన ఓ యువతికి ఏంజెలీనా జోలీనాకి వీరాభిమాని తను కూడా అలాగే అవ్వాలని కొన్ని ప్రయత్నాలు చేసింది. అవన్నీ విఫలమై దేశవ్యాప్తంగా నవ్వులు పాలవుతుంది. 
సహర్ తబర్ (19) ఇరాన్ కు చెందిన యువతి. సహర్ తబర్ కి ఏంజెలీనా జోలీ అంటే ప్రాణం అంతేకంటే పిచ్చి. తనలా అందంగా ఉండాలని కలలు కన్నది. అనుకున్నదే తడువుగా ఏంజెలీనాలా అవ్వాలంటే ఏం చేయాలి అని అన్వేషించింది. ఈ అన్వేషణలో వైద్యుల్ని సంప్రదించగా ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే తాను కూడా ఏంజెలీనాలా అవ్వొచ్చని సలహా ఇచ్చారు. అంతే తాను ప్రాణంగా అభిమానించే ఏంజెలీనాలా అయితే ఇంతకంటే కావాల్సింది ఏముంటుందని అనుకుంది. ఎవరైతే ప్లాస్టిక్ సర్జరీ సలహాయిచ్చారో ఆ వ్యక్తి వద్ద ప్లాస్టిక్ సర్జరీకి సిద్ధమైంది. సర్జరీ అంటే ఒకటి, రెండు కాదు మొత్తం 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. సర్జరీ చేయించుకున్న ప్రతీ సారి విఫలం అవ్వడం, మళ్లీ ప్రయత్నించడం అవి విఫలం అవ్వడంతో ప్లాస్టిక్ సర్జరీకి ముందు కుందనపు బొమ్మలా ఉన్న ఆ ముద్దుగుమ్మ ప్లాస్టిక్ సర్జరీ తరువాత దెయ్యంలా తయారైంది.  దీంతో తన చేసిన తప్పును వివరిస్తూ, ఎవరూ తనలాగ అవ్వకూడదనే ఉద్దేశంతో  తన ఫోటోల్ని  ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. అంతే ఒక్కసారిగా ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమెలా అందం కోసం ప్రయత్నించవద్దని చెబుతూ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు మీరు కూడా చూడండి.

English Title
sahar-tabar-plastic-surgery

MORE FROM AUTHOR

RELATED ARTICLES