సఫిల్‌గూడ చెరువు... మురుగు నీటి కంపు

సఫిల్‌గూడ చెరువు... మురుగు నీటి కంపు
x
Highlights

సాయంత్రం పూట చెరువుల పక్కన సరదాగా గడపడటమంటే.. ఎవరికైనా ఇష్టమే. పట్టణాల్లో అయితే అలా ఉల్లాసంగా కాలం గడపాలని తహతహలాడిపోతుంటారు. వాకింగ్ చేయాలన్నా,...

సాయంత్రం పూట చెరువుల పక్కన సరదాగా గడపడటమంటే.. ఎవరికైనా ఇష్టమే. పట్టణాల్లో అయితే అలా ఉల్లాసంగా కాలం గడపాలని తహతహలాడిపోతుంటారు. వాకింగ్ చేయాలన్నా, స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకోవాలన్నా, పిల్లలతో సరదాగా గడపాలన్నా అదే సరైన ప్లేస్‌గా ఫీల్ అవుతారు.. కానీ ఆ చెరువు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.. మురికి కూపం.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం.. క్లీన్‌చెయ్యని వాష్ రూమ్‌లు.. కాలుష్యంతో నిండిన ప్రదేశాలు.. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ పరిస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్‌బండ్. నిత్యం ఎంతో మంది పిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఈ ప్రాంతంలో వచ్చి సేద తీరుతుంటారు.. వాకింగ్, యోగా, వ్యాయామాలు చేస్తుంటారు.. అయితే వీరందరూ కామన్‌గా ఓ ప్రాబ్లమ్ ఎదుర్కుంటున్నారు. దీంతో ఆరోగ్యం మాట అటు ఉంచితే అనారోగ్యం పాలవుతున్నారు.. మినీ‌ట్యాంక్ బండ్‌గా పేరున్నఈ చెరువుచెత్తా చెదారంతో విషతుల్యం అయ్యింది.. దీని నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేక పోతున్నామంటున్నారు వాకర్స్..తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కార్‌ చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతామని.. వాటిని పరిరక్షిస్తామంటూ లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో చాలా చెరువుల పరిస్థితి ఇలాగే ఉంది.. చెరువులో పెరిగిన కాలుష్యం వల్ల దుర్గంధం వస్తుండటంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు చెరువులో చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద కూడా అధికంగా ఉంది.. ఈ విషయంపై పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకున్న పాపాన పోలేదని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ‎ఆరోగ్యంగా ఉండేందు ఈ చెరువు పరిసరాల్లో వ్యాయామం చేస్తే.. కొత్త రోగాలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్మవ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయంటున్నారు.. అంతే కాకుండా ఈ నీటితో జలచరాలు, పక్షుల మనుగడ కూడా ప్రమాదం ఉందటున్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో పూడికలు తీసి బాగుచేయాలంటున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories