సబిత ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్‌కు బిగ్ షాక్

Submitted by chandram on Thu, 11/15/2018 - 15:35
karthik

కాంగ్రెస్ పార్టీకి నిరసనల సెగ రోజు రోజుకి అధికమవుతోంది. టికెట్లు వస్తయని ఆశపడి చివరకు టికెట్లు దక్కపోవడంతో రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరికొందరైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇదే తరహాలో మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బాటపడ్డాడు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి సీటు దక్కలేదని తీవ్రమనస్తాపనికి గురై ఆయన నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ సీటిస్తారో లేక తన రాజీనామా ఆమోదిస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని కార్తీక్ డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ లో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. దింతో కార్తీక్ రెడ్డి రెబల్ గా పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

English Title
sabitha indrareddy son karthik reddy resign congress party

MORE FROM AUTHOR

RELATED ARTICLES