ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీదే గెలుపు: సబ్బం హరి

Submitted by arun on Mon, 09/10/2018 - 12:06
Sabbam Hari

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీదే విజయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే మంచి పాలనను అందిస్తామనే భరోసాను ప్రజలకు కల్పించడంలో వైసీపీ పూర్తిగా విఫలమయిందని తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను, మోసాలను ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సఫలమయ్యారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని చెప్పారు. పార్లమెంటులో ప్రజాస్వామ్యానికి విలువే లేకుండా పోయిందని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సబ్బం హరి తెలిపారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేస్తాననే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి ఏ మాత్రం లేదని చెప్పారు. మోదీ గ్రాఫ్ పడిపోతోందని, బీజేపీ ప్రజాదరణను కోల్పోతోందని తెలిపారు. 

English Title
Sabbam Hari says will contest 2019 polls

MORE FROM AUTHOR

RELATED ARTICLES