తెలంగాణ రైతులకు శుభవార్త...పంట సాయం చెక్కుల పంపిణీ తేదీ ఖరారు

Submitted by arun on Wed, 04/18/2018 - 10:39
kcr

తెలంగాణ రైతులకు శుభవార్త..రైతులకు పంట సాయం అందించే చెక్కుల పంపిణీ తేదీ ఖరారైంది. రైతు బంధు పథకం కింద రైతులకు చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి కూడా అదే రోజు శ్రీకారం చుడతారు. 

రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమై చర్చించారు. రైతుబంధు పథకం పేరుతో అన్నదాతలకు ఎకరాకు ఏడాదికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీని మే 10న ప్రారంభించబోతున్నట్లు సీఎం తెలిపారు. మొదటి విడతగా వర్షాకాలం పంట కోసం ఎకరానికి 4వేలు ఇచ్చే కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడతారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీని కూడా ఆదే రోజు ప్రారంభింస్తారు.

58 లక్షల మంది రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ప్రతి రోజు 8,25,571 మందికి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ చేయాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 2 వేల 762 బృందాలను నియమిస్తారు. పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెక్కులిచ్చిన రైతులకు నగదు ఇవ్వడానికి వీలుగా బ్యాంకుల్లో కావాల్సిన నిల్వలు ఉంచడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని సిఎం చెప్పారు. 

ఏ గ్రామంలో ఏ రోజు చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలో కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని పత్రికా ప్రకటనల ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా  ప్రజలకు తెలియచేస్తారు. 300 పాస్ పుస్తాలకు ఒకటి చొప్పున బృందాన్ని నియమించి, ఒకే రోజులో అందరికీ పంపిణీ చేస్తారు. రైతులకు పాస్ పుస్తకం, చెక్కులు ఇచ్చి వారి సంతకాలు తీసుకుంటారు. ఆ రోజు గ్రామంలో రైతులు లేకుంటే తర్వాత వాటిని మండల కార్యాలయంలో మూడు నెలల వరకు అందుబాటులో ఉంచి, అందిస్తారు. పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యాచరణపై ఈ నెల 21 ప్రగతి భవన్‌లో కలెక్టర్ల సదస్సు జరుపుతామని కేసీఆర్ తెలిపారు. 

English Title
rythu bandhu scheme cheque distribution from may 10

MORE FROM AUTHOR

RELATED ARTICLES