కేన్సర్‌ కణితి కోతులెత్తుకెళ్లాయ్‌!

Submitted by arun on Sun, 11/04/2018 - 10:30

చికిత్స చేసి జబ్బు తగ్గించాల్సిన వైద్యులు. రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మెదడులో కణతితో బాధపడుతున్న పేషెంట్‌ పట్ల. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు ప్రదర్శించిన నిర్లక్ష్యం. వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని నిరూపిస్తుంది. 

ఇతని పేరు సునీల్‌కుమార్‌. చిత్తూరు జిల్లా పీలేరు మండలం నాలేవాండ్ల పల్లెకు చెందిన సునీల్. కమ్యూనిటీ పోలీసుగా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సునీల్‌. చికిత్స కోసం గత మార్చ్‌లో తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. మెదడులో ట్యూమర్ ఉందని, కేన్సర్ లక్షణాలున్నాయని నిర్థారించారు. అయితే పరీక్షల కోసం కణతిలోని కొంత భాగాన్ని వేరు చేసి పెథాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. అయితే రెండు వారాల తర్వాత రిపోర్ట్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన సునీల్‌కు. డాక్టర్లు ఏదో రిపోర్ట్‌ రాసిచ్చి చేతికిచ్చారు.

అంతేకాకుండా. తదుపరి చికిత్స కోసం స్విమ్స్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో రుయా డాక్టర్ల సూచన మేరకు స్వీమ్స్‌కు వెళ్లిన సునీల్‌కు. వారి నుంచి అసలు ఊహకు కూడా అందని సమాధానం ఎదురైంది. బ్రెయిన్‌ నుంచి తీసిన కణతి స్పెసిమన్‌. కోతి ఎత్తుకుపోయినట్లు రుయా డాక్టర్లు రిపోర్ట్‌ ఇచ్చారంటూ. స్విమ్స్‌ వైద్యులు తెలిపారు. దీంతో ఆ బయాప్సీ ముక్క ఉంటే గానీ రిపోర్టు రాదని. రిపోర్టు ఉంటేనే చికిత్స చేయగలమని స్విమ్స్‌ వైద్యులు చేతులెత్తేశారు. అలాగే రెండవ సారి ఆపరేషన్ చేసి బయాప్సీ తీసే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు.

అయితే జరిగిన దానిపై రుయా వైద్యులు కానీ, పెథాలజీ డిపార్ట్‌మెంట్‌ వారు కానీ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే న్యూరో సర్జన్స్‌ మాత్రం మరోసారి ఆపరేషన్ చేసిన పర్వాలేదంటూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రాడు ప్రాణాలతో పోరాడాల్సి వస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకొని తనకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నాడు. 

English Title
Ruya Hospital Doctors Negligence On Patients

MORE FROM AUTHOR

RELATED ARTICLES