హెలికాఫ్టర్ కూలి 18 మంది మృతి

Submitted by arun on Sat, 08/04/2018 - 15:11
helicopter

రష్యాకు చెందిన హెలికాప్టర్‌ సైబీరియా ఉత్తర ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులను తీసుకొని వెళ్తున్న హెలికాఫ్టర్ టేక్‌ఆఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 18 మంది మృతి చెందారు. ఇందులో 15 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు హెలికాఫ్టర్ సిబ్బంది ఉన్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
 
ఎంఐ 8 అనే హెలికాఫ్టర్ వాంకోర్‌ అనే కంపెనీ సిబ్బందిని తీసుకొని శనివారం ఉదయం బయల్దేరాడినిక సిద్ధమైంది. అయితే టేకాఫ్ అయిన తర్వాత మరో విమానంలోని పరికరాలు తగలడంతో పేలుడు సంభవించింది. దీంతో అది అక్కడిక్కడే కూలిపోయింది. కాగా మరో హెలికాఫ్టర్ జాగ్రత్తగా టేకాఫ్ అయింది. ఆ సయంలో అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.
 

English Title
Russian helicopter crash kills 18 in Siberia

MORE FROM AUTHOR

RELATED ARTICLES