కాకుండా పోతున్న రూపాయిని కాపాడెవరు?

Submitted by santosh on Fri, 10/05/2018 - 15:05
Rupee hits three month low against US dollar

ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనుకుంటున్నారు. మా పాలన బాగుందంటే... కాదు మా పరిపాలనే క్షేమంగా ఉందనుకుంటున్నాయి... బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు. యూపీఏ హయాంలో రూపాయి విలువ డాలరుకు 68 రూపాయలకు పడిపోయి రికార్డు సృష్టిస్తే... తాజాగా మోడీ ప్రభుత్వంలో రూపాయి విలువ అంతకంతకు దిగజారిపోయింది. అత్యంత కనిష్టంగా 73 రూపాయలకు పతనమయ్యింది. 

యూపీఏ హయాంలో రూపాయి విలువ కూడా పాతాలానికి పడిపోయింది. మన్మోహన్‌ సింగ్‌ అధికారంలో ఉండగా 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు 68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. అదే మోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాన్ని రూ.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. అదే సర్కార్‌ 2018 జూన్‌ 28న రూ.69.09కు పతనం చెందింది రూపాయి. 2018 ఆగస్టు ఆగస్టు 1న 68.30 రూపాయలుగా ఉండగా, ఆగస్టు 13న 69.47కి పడిపోయింది. అదే ఆగస్టు 14న 70 రూపాయలకి చేరుకుంది. ఆగస్టు 30న 70.82పైసలకు పతనమయ్యింది. ఇక సెప్టెంబర్‌‌ 10న 72.50కి చేరుకోగా, సెప్టెంబర్‌ 18న 72.97 పైసలకు రూపాయి విలువ పడిపోయింది.

మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 మే నెలలో 60.27గా రూపాయి డాలరుతో పోటీపడింది. డిసెంబర్‌ 31 నాటికి 63.03 రూపాయలకి పడిపోయింది. 2015లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ... డిసెంబర్‌ 31 నాటికి 66.16కి దిగజారింది. 2016లో రూపాయి విలువ డాలరుతో నవంబర్‌ 23న 68.87ని టచ్‌ చేసి, డిసెంబర్‌ 30కి 67.85కి పడిపోయింది. ఇక 2017లో రూపాయి విలువల ఆరంభంలో 68 ఉండగా క్రమేపి 63.87గా నమోదయ్యింది. 2017 అక్టోబర్‌ 3న రూపాయి విలువ 65.49 కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ 3న 73.41కి పడిపోయింది. 2018లో జనవరి 2న 63.46గా ఉన్న రూపాయి విలువ క్రమేపి అంతకంతకు బలహీనపడుతూ.. 73.34కి చేరింది.

English Title
Rupee hits three month low against US dollar

MORE FROM AUTHOR

RELATED ARTICLES