బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండె పోటు

x
Highlights

గుండె పోటుతో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. చెన్నై నుంచి తిరుమలకు వస్తున్న బస్సులో డ్రైవర్ అరుణాచలానికి...

గుండె పోటుతో డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. చెన్నై నుంచి తిరుమలకు వస్తున్న బస్సులో డ్రైవర్ అరుణాచలానికి హఠార్తుగా గుండె పోటు వచ్చింది. దీంతో పిచ్చాటూర్ వద్ద బస్సు నిలిపివేశాడు. బస్సులోనే కుప్పకూలిపోయాడు. ముందస్తుగా బస్సు నిలిపివేయడంతో.. ప్రయాణికులకు ప్రాణాలతో బయపడినా, డ్రైవర్‌ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.

మరికొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని తెలిసినా.. తన ప్రాణాల కన్నా విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చాడు. మరికాసేపట్లో తాను చనిపోతున్నానని తెలిసినా.. తన గురించి ఆలోచించకుండా, పక్కవారి ప్రాణాలను కాపాడటానికే ప్రయత్నించాడు. విధి నిర్వహణలో డ్రైవర్ గా, తన బస్సులోని ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. కానీ ఆయన మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

48 సంవత్సరాల అరుణాచలం.. తిరుమల బస్సు డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా చెన్నై నుంచి తిరుమలకు బయలుదేరాడు. బస్సు పిచ్చాటూరు సమీపంలోకి వచ్చే సరికి అరుణాచలానికి గుండె నొప్పి మొదలైంది. తనకు ఏదో ఆపద ముంచుకోచ్చిందని తెలియడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ సమయంలో తనకన్నా.. బస్సులో ఉన్న ప్రయాణీకుల గురించే ఆలోచించాడు. ముందుజాగ్రత్తగా బస్సును పిచ్చాటూరు బస్టాండ్ వద్ద ఆపేశాడు. ఏం జరుగుతుందోనని ప్రయాణీకులు చూసేలోపే.. డ్రైవర్ సీటులో ఉన్న అరుణాచలం, స్టీరింగ్ పై కుప్పుకూలిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories