అఖండ భారతంలో అరెస్సెస్‌ అంటరాని సంస్థా?

అఖండ భారతంలో అరెస్సెస్‌ అంటరాని సంస్థా?
x
Highlights

అఖండ భారత్ స్థాపన ధ్యేయంతో అడుగులేసిన ఆరెస్సెస్ మారుతున్న కాలంలో తన రూపు రేఖలను మార్చుకుంటోందా? హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో స్థాపించిన ఈ సంస్థ...

అఖండ భారత్ స్థాపన ధ్యేయంతో అడుగులేసిన ఆరెస్సెస్ మారుతున్న కాలంలో తన రూపు రేఖలను మార్చుకుంటోందా? హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు కనపడని రాజకీయాలకు వేదికగా మారుతోందా? ఆరెస్సెస్ హిందూ అతివాద సంస్థగా ఎందుకు ముద్ర పడుతోంది? ఇలా
ప్రముఖ జాతీయ వాద సంస్థ ఆరెస్సెస్ సంస్థ మరోసారి వార్తల కెక్కింది. గత కొంత కాలంగా ఈ సంస్థ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు అఖండ భారత్ స్థాపన ధ్యేయంగా అడుగులేసిన సంస్థ ఇప్పుడు అంటరాని సంస్థ.

సంఘ్ పరివార్ గ్రూప్ నుంచి వచ్చిన ఈసంస్థ1925లో భారతీయ యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైంది.. కేశవ్ బలిరాం హెగ్డేవార్ దీని సృష్టికర్త.. యువకుల శరీర దారుఢ్యాన్ని మెరుగుపరచి దేశ రక్షణ కోసం సుశిక్షితుడైన సైనికునిగా తయారు చేయాలన్నది సంస్థ లక్ష్యం.. హిందూత్వ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఏర్పడిన ఆరెస్సెస్ సంస్థ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిందూ జాతీయ వాదసంస్థగా రూపు దాల్చింది. ఈ సంస్థ పరిధిలో కాలక్రమంలో ఎన్నో స్కూళ్లు, విద్యాసంస్థలు, ఛారిటీలు, సహాయ సంస్థలు ఏర్పడ్డాయి. ఆరెస్సెస్ సంస్థను ఇప్పటికి మూడుసార్లు నిషేధించారు. కాంగ్రెస్ లౌకిక వాద శక్తుల బలంతో అధికారం సాధించగా, బిజెపి కేవలం హిందూత్వ శక్తులు ఏకం చేయడం ద్వారా అధికార సాధనపై దృష్టి పెట్టింది.

ఇలా చరిత్ర తిరగేస్తే ఆరెస్సెస్ మీటింగులకు గెస్టులుగా వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత పాసింగ్ అవుట్ పెరేడ్ కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆహ్వానం పంపారు. ఈ సమావేశానికి వెళ్లేందుకు ప్రణబ్ కూడా ఆమోదం తెలిపారు. మోహన్ భాగవత్ కు, ప్రణబ్ కు కొంత కాలంగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. అయితే జీవితకాలం ఫక్తు కాంగ్రెస్ వాదిగా, లౌకిక వాదిగా ఉన్న ప్రణబ్ ఇప్పుడు ఒక హిందూ మత సంస్థ సమావేశానికి ఎలా వెడతారంటూ పెద్ద దుమారం రేగింది. కాంగ్రెస్ సీనియర్లంతా ప్రణబ్ వెళ్లొద్దంటూ సందేశాలు పంపారు.. రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిని ఏలిన ప్రణబ్ సంఘ్ పరివార్ సంస్థ మీటింగ్ కి వెళ్లడం అందులోనూ ఎన్నికలున్న సమయంలో వెళ్లడం సరైంది కాదనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

ఇక ప్రణబ్ ఈ సమావేశానికి ఓకే చెప్పడంపై బిజెపి పెద్దలు ఎగిరి గంతేస్తున్నారు. ప్రణబ్ లాంటి నేత రావడం వల్ల తమ సంస్థపై ఉన్న రాజకీయ అంటరానితనం ముద్ర చెరిగిపోతుందంటూ నితిన్ గడ్కరీ కామెంట్ చేశారు. మొత్తం మీద ప్రణబ్ ఆరెస్సెస్ మీటింగ్ కి వెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆరెస్సెస్ మీటింగ్ పై అంత దుమారం ఎందుకు? ఆరెస్సెస్ హిందూ అతివాద సంస్థగా ముద్ర పడుతోందా?ఆరెస్సెస్ సిద్ధాంతాలపై రాద్ధాంతం ఎందుకు?

Show Full Article
Print Article
Next Story
More Stories