మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్‌తో బీజేపీకి లింకేంటి? చరిత్ర ఏం చెబుతోంది?

మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్‌తో బీజేపీకి లింకేంటి? చరిత్ర ఏం చెబుతోంది?
x
Highlights

ఆర్ఎస్ఎస్.....రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. జాతి కోసం దేశం కోసం నిస్వార్థంతో కూడిన వ్యక్తుల సమూహమే ఆర్ఎస్ఎస్. దేశం కోసం స్వప్రేరణతో, ధృడ సంకల్పంతో తమంతట...

ఆర్ఎస్ఎస్.....రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. జాతి కోసం దేశం కోసం నిస్వార్థంతో కూడిన వ్యక్తుల సమూహమే ఆర్ఎస్ఎస్. దేశం కోసం స్వప్రేరణతో, ధృడ సంకల్పంతో తమంతట తాముగా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలను తయారు చేయాలన్న సంకల్పానికి నాందీవచనమే ఆర్‌ఎస్‌ఎస్‌. స్వాతంత్ర్య సమరం జోరు మీదున్న రోజుల్లో ఆర్ఎస్‌ఎస్‌ స్థాపించిన డాక్టర్‌ కేశవ్‌ బల్‌రామ్‌ హెడ్గేవార్‌... తర్వాత్తర్వాత మర్రిఊడలా దేశమంతా విస్తరించింది. తన ప్రాభవాన్ని చాటుకుంటూపోతోంది.

ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొంతమంది యువకులతో ఏర్పాటు చేసిన సంస్థే బజరంగ్‌దళ్. ఇది పూర్తి స్తాయి మిలిటెన్సీ ఆర్గనైజేషన్. ఆయుధ శిక్షణతో పాటు త్రిశూల ధారణ చేయిస్తారు ఇందులో. వీహెచ్‌పీ ఏర్పాటు తర్వాత దేశంలో జరిగిన ప్రతి మత ఘర్షణల్లో బజరంగ్‌దళ్ ప్రమేయం ఉంటుందనేది ఓ అభియోగం. సంఘ్ పరివార్‌ నుంచి పలువురు నేతలు రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా బీజెపీ నేతల్లో చాలా మంది సంఘ్ నుంచి వచ్చిన వాళ్లే.

అటల్ బిహారి వాజ్‌పేయ్....ఉత్తరప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వాజ్‌పేయ్ సరస్వతీ శిశు మందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఎంఏ పాలిటిక్స్‌ చదివి ఆర్ఎస్ఎస్ పూర్తిస్తాయి కార్యకర్తగా కొనసాగారు. ఆ తర్వాత భారతీయ జనసంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాజ్‌పాయ్....తర్వాత అద్వానీతో కలసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. లాల్ కృష్ణ అద్వానీ. అప్పటి అఖండ భారత్‌లోని కరాచీలో జన్మించిన అద్వానీ కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆ తర్వాత జనసంఘ్‌లో బాధ్యతలు నిర్వహించి, వాజ్‌పేయ్‌తో బీజేపీ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఇక మరో నేత మురళీ మనోహర్ జోషి. నైనిటాల్‌లో పుట్టిన జోషి.....మొదట ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్‌గా పని చేశారు. ఆ తర్వాత సంఘ ఆదేశాలతో ఉత్తరప్రదేశ్ ఏబీబీపీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత జనసంఘ్‌ జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. బీజెపీ ఏర్పాటు తర్వాత కీలక బాధ్యతలు నిర్వహించారు.

వాయిస్3: ఇక అంబాలా కంటోన్మెంట్‌లో పుట్టిన సుష్మా స్వరాజ్ తండ్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన సుష్మా.....జనతా పార్టీలో కీలక నేతగా మారారు. హర్యానాలోని దేవీలాల్ ప్రభుత్వంలో 27ఏళ్లకే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బీజెపీలో చేరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో పుట్టిన మోడీ... విద్యార్థి దశలోనే ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు. తర్వాత ఆర్ఎస్ఎస్ పూర్తిస్తాయి కార్యకర్తగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి నాటి బీజెపీ నేతలు శంకర్ సింగ్ వాఘేలా, కేశూ భాయ్ పటేల్ ప్రోత్సాహంతో బీజెపీలో చేరి... మురళీ మనోహర్ జోషీ ఏక్తా యాత్రలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీలో పుట్టిన అరుణ్ జైట్లీ కుటుంబానికి కూడా ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉంది. 1991 నుంచి బీజెపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఆరో తరగతి వరకే చదువుకున్న ఉమా భారతి సన్యాసం స్వీకరించి.....హిందూ ప్రచారం మొదలు పెట్టారు. విశ్వహిందూ పరిషత్‌లో కీలక నేతగా పనిచేసిన ఆమె.... అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయి ప్రోత్సాహంతో బీజెపీలో చేరి ప్రస్తుతం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గ్వాలియర్ రాజ కుటుంబంలో పుట్టిన వసుంధరరాజె సింథియా తల్లి విజయరాజె సింధియా బీజెపీలో కీలక నేత. వసుంధర... బీజెపీ యువమోర్చా రాజస్థాన్‌ శాఖ అధ్యక్షురాలిగా పని చేశారు. ఆ తర్వాత వాజ్‌పాయ్ సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇక రాజ్‌నాథ్ సింగ్.... 13వ ఏట చే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఇలా ఎలా చెప్పుకున్న బీజేపీ మూలాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రంగానే కనిపిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories