ఒకేసారి ఇద్దరిని పెళ్లాడనున్న క్రీడాకారుడు!

Submitted by nanireddy on Fri, 05/25/2018 - 10:10
ronaldinho-will-marry-two-women-same-time

ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడనున్నాడు ఓ క్రీడాకారుడు. ఇద్దరిని ప్రాణానికీ ప్రాణంగా ప్రేమించాడు. పైగా వారితో డేటింగ్ లో ఉండటంతో ఇద్దరిని పెళ్లాడాక తప్పని పరిస్థితి.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరానుకుంటున్నారా? బ్రెజిల్  స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ రోనాల్డిన్హో (38) నే ఈ పెళ్లి చేసుకోబోతున్నాడు. 2012 లో  ప్రిసిల్లాతో ప్రేమలో పడిన అయన 2016 నుంచి మరో యువతి బియాట్రిజ్‌ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసి బ్రెజిల్ లోని ఓ రిసార్ట్ లో సహజీవనం చేస్తున్నారు. ఆగస్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహానికి పలువురు ఫుట్ బాల్ ప్లేయర్లతోపాటు ఇతర క్రీడకురులు కూడా హాజరుకానున్నారు. ఇదిలావుంటే  రోనాల్డిన్హో ఒకేసారి ఇద్దరిని పెళ్లాడటం ఏమాత్రం ఇష్టం లేని అతని సోదరి పెళ్ళికి హాజరు కానని తేల్చి చెప్పారు. కాగా  రోనాల్డిన్హో బ్రెజిల్ తరుపున  ఇప్పటివరకు 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్‌ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్‌ కప్‌ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర పోషించాడు. 

English Title
ronaldinho-will-marry-two-women-same-time

MORE FROM AUTHOR

RELATED ARTICLES