డకౌట్లలో రోహిత్ శర్మ రికార్డు

Submitted by arun on Thu, 02/22/2018 - 15:31
Rohit Sharma

సౌతాఫ్రికాతో తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. జోహెన్స్ బర్గ్ లో ముగిసిన తొలి టీ-20లో 21 పరుగులు సాధించిన రోహిత్...సెంచూరియన్ లో ముగిసిన రెండో టీ-20 లో మాత్రం గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలిబంతికే...సఫారీ యువఫాస్ట్ బౌలర్ జూనియర్ డాలా కు LBW గా దొరికిపోయాడు. భారత టీ-20 చరిత్రలో నాలుగుసార్లు డకౌటైన తొలి క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. అషీశ్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్ చెరో మూడు డకౌట్లతో రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచారు. టీ-20ల్లో తొలిబంతికే డకౌటైన ఇతర భారత ఆటగాళ్లలో మురళీ విజయ్, అజింక్యా రహానే, కెఎల్ రాహుల్ ఉన్నారు.

English Title
Rohit Sharma registers unwanted record of most ducks by an India player in T20I

MORE FROM AUTHOR

RELATED ARTICLES