రో..రి లవ్ స్టోరీ

రో..రి లవ్ స్టోరీ
x
Highlights

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరాఠా మెరిక రితిక జంట భారత క్రికెట్ కే సరికొత్త కళ తీసుకు వచ్చారు. ఐపీఎల్ నుంచి టీమిండియా సిరీస్ ల వరకూ...

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మరాఠా మెరిక రితిక జంట భారత క్రికెట్ కే సరికొత్త కళ తీసుకు వచ్చారు. ఐపీఎల్ నుంచి టీమిండియా సిరీస్ ల వరకూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ
భార్యాభర్తలు అంటే ఎలాఉండాలో నేటితరానికి చెప్పకనే చెబుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా నిలిచే రో రి లవ్ స్టోరీ ఏంటో చూడండి.

భారత క్రికెట్ నవతరం ఆటగాళ్లతో కొత్తపుంతలు తొక్కుతోంది. రోహిత్ శర్మ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కొహ్లీ లాంటి క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లి చేసుకొని నిజ జీవితంలోనూ నూరేళ్ల భాగస్వామ్యాన్ని మొదలు పెట్టారు. అయితే వీరిలో కొందరివి పెద్దలు కుదిర్చిన సంబంధాలైతే రోహిత్ శర్మ లాంటి కొందరు మాత్రం ప్రేమపెళ్ళిళ్లతో ఓ ఇంటివారయ్యారు.
ప్రపంచ వన్డే క్రికెట్లోనే డాషింగ్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ రెండేళ్ల క్రితమే ముంబైకి చెందిన మెరుపుతీగ రితికా సజ్డే ను వలచి వలపించుకొని తన జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు.

ముంబైలోని ఓ యాడ్ కంపెనీలో క్రియేటివ్ టీమ్ సభ్యురాలిగా పనిచేస్తున్న రితిక సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ ద్వారా రోహిత్ కు పరిచయమయ్యింది. యువరాజ్ సింగ్ తో కలసి ఓ కమర్షియల్ లో నటించడానికి రోహిత్ కలసి వెళ్లిన సమయంలో రితిక కంటపడింది. తొలిచూపులోనే రితికను చూసి రోహిత్ మనసుపారేసుకొన్నాడు. తన కోసమే పుట్టినట్లుగా భావించి ముందుగా పరిచయం పెంచుకొని ఆ తర్వాత ప్రేమగా మార్చుకొన్నాడు. రెండు కుటుంబాల పెద్దల సమ్మతితో రోహిత్- రితిక జోడీ తమ ప్రేమను కాస్త వివాహబంధంగా మలచుకోగలిగారు. రోహిత్-రితిక జంట ను చూసిన వారందరూ తెగమురిసిపోయారు. జంట అంటే ఇదేరా అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే రోహిత్ కు పెళ్లైన కొద్దిమాసాలకే కాలికి తీవ్రగాయమై ఆటకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ లో శస్త్రచికిత్స చేయించుకొన్న సమయంలో ఆ తర్వాత రితిక తోడునీడగా ఉంటూ రోహిత్ లో ఆత్మస్థైర్యం
నింపింది. త్వరగా కోలుకొని తిరిగి బ్యాట్ పట్టుకొనేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి క్రికెట్ రీఎంట్రీ చేసిన రోహిత్ మరితిరిగి చూసింది లేదు. తమ రెండో పెళ్లిరోజునే మొహాలీ వన్డేలో టీమిండియా కెప్టెన్ గా ఆడుతూ రోహిత్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. అంతేకాదు డబుల్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ప్లేయర్ల గ్యాలరీలో ఉన్న తన స్వీట్ హార్ట్ రితిక వైపు చూస్తూ సంజ్ఞ చేస్తూ రోహిత్ మైమరచి పోయాడు. రోహిత్ డబుల్ థమాకాను చూసి రితిక పట్టలేని ఆనందంతో కన్నీరుమున్నీరయ్యింది.

అంతేకాదు ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో సైతం రోహిత్ ప్రపంచ రికార్డు స్థాయిలో అదీ కేవలం 35 బాల్స్ లోనే మెరుపు సెంచరీ సాధించాడు. అదేరోజున తన భార్య రితిక పుట్టినరోజు కావడంతో టీ-20 శతకాన్ని సైతం ఆమె కోసమే సాధించినట్లుగా రోహిత్ పొంగిపోయాడు. రంగం ఏందైనా జీవితంలో విజయవంతమైన ప్రతిపురుషుడు వెనుక ఓ మహిళ స్ఫూర్తిగా ఉంటుందనడానికి రోహిత్ శర్మ వెనుక ఉన్న రితిక ఉండటమే నిదర్శనం. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఎంత అన్నోన్యంగా ఉండాలో రోహిత్ రితికల జోడీని చూసి నేటితరం జంటలు చూసి నేర్చుకొంటే చాలు జీవితం నందనవనమే కాదు ప్రేమానురాగాల పొదరిల్లుగా ఆనందాల హరివిల్లుగా మిగిలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories