బస్సు చక్రాల కింద పడిన మూడేళ్ళ బాలుడు..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 11:59
Road-accident-in-Hyderabad

స్కూల్ బస్సు చక్రాల కింద నలిగి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తారామతిపేటలో జరిగింది.తారామతిపేటకు చెందిన  బుర్ర నర్సింహా, స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు మూడేళ్ల తన్వీష్‌ ను తీసుకెళ్లింది స్వాతి. 

పెద్ద కొడుకును బస్సు ఎక్కిస్తుండగా.. తన్వీష్‌ బస్సు వెనక్కు వెళ్లాడు. ఈలోగా డ్రైవర్ బస్సును వెనక్కి పోనివ్వడంతో.. వెనుక చక్రాల కిందపడి తన్వీష్‌ నలిగిపోయాడు. అప్పటి వరకు తన కళ్లముందే ఉన్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో.. ఆ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ ఘటనతో  స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. 

English Title
Road-accident-in-Hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES