ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Submitted by nanireddy on Mon, 12/03/2018 - 08:03
road-accident-four-died-kurnool

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్‌ మండలం కొత్తపల్లె క్రాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. కారును వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  బాధితులు ఆదివారం సాయంత్రం అనంతపురంలో జరిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సభకు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
road-accident-four-died-kurnool

MORE FROM AUTHOR

RELATED ARTICLES