ఒక్కో ఓటు ఖరీదు రూ.10వేల నుంచి 6వేల వరకు

ఒక్కో ఓటు ఖరీదు రూ.10వేల నుంచి 6వేల వరకు
x
Highlights

తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గంలో బైఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం వివిధ పార్టీల అభ్యర్ధులు ఓటర్లను తమవైపు...

తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గంలో బైఎలక్షన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం వివిధ పార్టీల అభ్యర్ధులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నోట్లకట్టలను వెదజల్లుతున్నట్లు తెలుస్తోంది. మెరీనా బీచ్‌ స్టేషన్‌, అన్నా మెమోరియల్‌, కన్నగి విగ్రహం వద్ద ఒక్కో ఓటరుకు రూ.10వేలు, రూ.6000, రూ.5000 ఇస్తునట్లు ఈసీ అధికారులు గుర్తించారు. ఇక కాశిమేడులో ఒక్కో ఓటరుకు రూ.10వేలు, రూ.6వేలు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్కేనగర్ లో గెలిచేందుకు రూ.100కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నట్లు డీఎంకే ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా డీఎంకే నేత స్టాలిన్‌ ఫిర్యాదు చేశారు. కాగా ఆర్కేనగర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియగా డిసెంబరు 21న ఉప ఎన్నిక, 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories