కోట్లు ఉండి యాచించడం అంటే ఇదే..

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 08:11
rich-women-doing-begging

'కోట్లు ఉండి యాచించడం ఎందుకు' అనే మాట వినే ఉంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ చైనాకు చెందింది. ఆమె వయసు 79 సంవత్సరాలు. ఒక్కగానొక్క కొడుకు.. అతను వ్యాపారాలు చేసి డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. ఆమె పేరిట ఓ విల్లా, కారు, ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లు నగదు ఉండేవి.. కానీ ఆమె చేసే పని మాత్రం పలువురికి కోపం తెప్పిస్తోంది. ఆ వృద్ధురాలు అన్ని ఆస్తులు, డబ్బు ఉండి.. హాంగ్‌జూ రైల్వేస్టేషన్‌లో యాచిస్తుంది. ఆమె కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా యాచించడం చేస్తోంది. దాంతో అతను ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమె పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు.. దాంతో ఆమెకోసం కొన్ని పోస్టర్లు సిద్ధం చేశారు.

వాటిలో 'ఆమెకెవ్వరూ సాయం చేయకండి! ఆమె చెప్పే కథలకు కరిగిపోకండి.. మీకు కనిపిస్తున్నంత అమాయకురాలు కాదు. ఆమె ధనవంతురాలు, ఐదంతస్తుల విల్లాలో నివసిస్తుంది.. దయచేసి ఆమెకు సాయం చేయకండి' అని రాసి ఉంది. ఆమె వయసు,అవతారం చూసి జనాలు జాలితో దానం చేసి వెళుతున్నారు.. ఆమె తొలుత రైల్వే స్టేషన్‌లో చిరువ్యాపారం చేసేది కానీ, రైల్వే అధికారులు ఆమెను అడ్డుకోవడంతో అదే రైల్వే స్టేషన్‌లో యాచించడం మొదలెట్టింది. రోజుకు 300 యువాన్లు కూడబెడుతుందట! ఇంటి వద్ద ఊరికే కూర్చోవడం ఇష్టం ఉండదని వయసు పెరిగేకొద్దీ డబ్బు అవసరం పెరుగుతుండటంతో యాచిస్తున్నానని ఆమె కథ తెలిసి అడిగిన వాళ్లకు చెబుతోంది.

English Title
rich-women-doing-begging

MORE FROM AUTHOR

RELATED ARTICLES