శ్రీరాం సాగర్ ఆయకట్టు రైతుల ఆశపై ప్రభుత్వం నీళ్ళు

Submitted by arun on Sat, 08/04/2018 - 16:00

శ్రీరాం సాగర్ ఆయకట్టు రైతుల ఆశపై ప్రభుత్వం నీళ్ళు  చల్లింది. ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి సాగునీటి విడుదల సాధ్యం కాదని తేల్చి చెప్పింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగు నీటి విడుదల గురించి 4 వ తేదీన ప్రకటన చేస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఈ అంశంపై చర్చలు జరిపింది. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మంత్రి పోచారం నివాసంలో హరీ‌శ్‌రావు, కవిత, ప్రశాంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కాకతీయ కాలువకు నీటి విడుదల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉండడంతో తాగు నీటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి రాక బాగా తక్కువగా ఉన్నదని ప్రభుత్వం వివరించింది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 15 TMCలు..త్రాగునీటి అవసరాలతో పాటు డెడ్ స్టోరేజి, ఆవిరి నష్టాలకు బొటాబొటిన సరిపోతాయని తెలిపింది. ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ప్రజలకు త్రాగునీటిని అందించడమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే వేసవి త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. ప్రజలు వాప్తవ పరిస్థితిని గమనించి సహకరించాలని ప్రభుత్వం కోరింది.  
 
అయితే SRSP నుంచి కాకతీయ కాలువకు సాగు నీటి విడుదల సాధ్యం కాదన్న మంత్రుల ప్రకటనతో నిజామాబద్ పోలీసులు అప్రమత్త మయ్యారు. గతంలో రైతులు చేసిన ఆందోళనలు , విధ్వంసం నేపథ్యంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు దగ్గర భారీసంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. నిజామాబాద్, కామారెడ్డి రేంజ్ పోలీసులతో ప్రాజెక్టు దగ్గర మూడంచెల భద్రతాను ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గ మొత్తం 144 సెక్షన్ విధించారు.  

English Title
review-meeting-on-the-sriram-sagar-project

MORE FROM AUTHOR

RELATED ARTICLES