సీఎం కేసీఆర్ మాట వింటే మీరు జైలుకే

Submitted by arun on Fri, 01/12/2018 - 14:44
revanth reddy

అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. కేసీఆర్ చెప్పినట్లు వింటే భవిష్యత్తులో జైలుకు వెళ్తారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు... ఇండియా బుల్స్ కంపెనీ ఇచ్చే కమిషన్‌లకు ప్రభుత్వం కక్కుర్తి పడిందన్న ఆయన.. జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నవి పచ్చి అబద్దాలని విమర్శించారు.. మూడున్నర ఏళ్లలో లగడపాటి, జూపల్లి రామేశ్వర్ రావు, సీమాంధ్ర నేతల కంపెనీల నుండి విద్యుత్ ను కొనుగోలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. తక్కువ ధరకు ఏపీ విద్యుత్ ఇస్తామన్నా ఎందుకు కొనలేదని నిలదీసారు.. ప్రభుత్వ అవినీతిని నిరూపించకపోతే అబిడ్స్ లో ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తెలంగాణ బిడ్డ అయితే తన సవాల్ ను స్వీకరించాలన్నారు.

English Title
RevanthReddy Challenge To CM KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES