రేవంత్ వర్సెస్ కేటీఆర్..రసవత్తర రాజకీయం..

రేవంత్ వర్సెస్ కేటీఆర్..రసవత్తర రాజకీయం..
x
Highlights

రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొడంగల్‌లో రోడ్‌ షో నిర్వహించిన కేటీఆర్‌ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం...

రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొడంగల్‌లో రోడ్‌ షో నిర్వహించిన కేటీఆర్‌ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రేవంత్‌ రెడ్డి రాజకీయాలు వదిలేస్తారా? అని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ను తిట్టగానే పెద్దవారు కాలేరన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవరే కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుంది సీల్డ్‌కవర్‌ సీఎం కావాలా? తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ సింహం కేసీఆర్‌ కావాలా? అని కేటీఆర్‌ ప్రజలను అడిగారు. ఏగట్టున ఉంటారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

రాజకీయ సన్యాసం గురించి మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌లో నిన్న చేసిన సవా‌ల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల సవాళ్ళు అనవసరమనీ ఇద్దరం నేరుగా తేల్చుకుందామని రేవంత్ అన్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ఇద్దరం పోటీ పడదామని ప్రతిపాదించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో కేటీఆర్ తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరు ఓడితా వారు రాజకీయ సన్యాసం చేయాలని రేవంత్ సవాల్ చేశారు. రేవంత్‌ను టార్గెట్ చేసిన కేటీఆర్ కు కూడా గట్టి షాకిచ్చేందుకు రేవంత్ రెడీ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి తనను ఎండగట్టిన కేటీఆర్ కు పోటీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పర్యటించాలని రేవంత్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సిరిసిల్లలో ప్రచారానికి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో పోరు కేటీఆర్ వర్సెస్ రేవంత్ లా మారింది. సిరిసిల్లలో వరుస పర్యటనలకు ప్రణాళికను వేస్తున్నారు. బహిరంగ సభలతో రోడ్ షోలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఎలాగైన కెటిఆర్‌ను ఎండగట్టాలని చూస్తున్నాడు. దీంతో కేటీఆర్ ను ఇరకటంలో పెట్టాలని రేవంత్ వేసిన ఉపయం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories