రేవంత్‌ వర్సెస్‌ హరీష్‌...కోస్గిలో టెన్షన్ టెన్షన్

x
Highlights

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. కోస్గి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్‌డిపో‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు....

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. కోస్గి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న బస్‌డిపో‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. డిపోకు కావాల్సిన భూమిని తానే ఇచ్చానని రేవంత్‌రెడ్డి ఎన్నో సార్లు చెప్పుకున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పోరుగా మారింది. కోస్గిలో ఏం జరుగుతుందన్న దానిపై టెన్షన్‌ మొదలైంది.

మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్‌ మండలం కోస్గిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మండల ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కోస్గి బస్‌ డిపోకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి కూడా హాజరుకానున్నారు. దీంతో కోస్గి బస్‌ డిపో శంకుస్థాపన కాస్తా మంత్రి హరీశ్‌రావు వర్సెస్‌ రేవంత్‌రెడ్డిగా మారింది.

బస్‌ డిపోను తానే మంజూరు చేయించానని స్థలం కూడా తానే ఇచ్చానని పలుమార్లు రేవంత్‌ రెడ్డి చెప్పుకున్నారు. తన హయాంలోనే బస్‌ డిపో ఏర్పాటు కాబోతుందన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, రేవంత్‌ రెడ్డి అనుచరులు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను కోస్గి మున్సిపాల్టీ పరిధిలో భారీగా ఏర్పాటు చేశారు. పట్టణంలో రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలు డామినేట్ చేస్తుండటంతో టీఆర్ఎస్‌ నేతలు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మున్సిపల్ అధికారులు రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలను తొలగించారు.

రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై టీఆర్ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డిపో తన హయాంలోనే వచ్చిందని స్థలం కేటాయించానంటూ రేవంత్‌ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని టీఆర్ఎస్‌ నేతలు విమర్శించారు. మరోవైపు బస్‌ డిపో కార్యక్రమానికి కొడంగల్ నుంచి కోస్గికి ర్యాలీగా బయలుదేరాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కోస్గిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories