ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని బట్టలూడదీసి కొట్టండి

Submitted by arun on Mon, 02/05/2018 - 10:30
revanth

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని బట్టలూడదీసి కొడితే.... బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య వెనుక ఎవరున్నారో బయటికి వస్తారన్నారు కాంగ్రెస్‌ లీడర్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించినందుకే బొడ్డుపల్లిని వేముల వీరేశం హత్య చేయించాడని రేవంత్‌ ఆరోపించారు. రంజిత్‌, సుధీర్‌ కాల్‌డేటా బయటికి తీస్తే.... వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పని చేస్తోందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కానిస్టేబుల్‌కు తక్కువ.. హోంగార్డుకు ఎక్కువగా ఉన్నందునే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాల్‌ డేటా ఆధారంగా తొలుత ఎమ్మెల్యే వీరేశం, అతడి కుటుంబ సభ్యుల బట్టలూడదీస్తే.. వారి వెనకాల ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి బయటికి వస్తారని పేర్కొన్నారు. ఆయన వీపు పగులగొడితే సీఎం కేసీఆర్‌ బయటికి వస్తారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కన్నెర్ర చేసి ఉంటే కేసీఆర్‌ కుటుంబం ఊర్లు తిరిగేదా అని ప్రశ్నించారు.

English Title
revanth reddy participated srinivas santhappa sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES