నన్ను అరెస్టు చేసుకోమను... నేను రెడీగా ఉన్నా: రేవంత్‌

Submitted by arun on Thu, 09/13/2018 - 11:02
revanth

కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కేసీఆర్‌ కక్ష సాధింపులకు దిగుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ కేసులో ఆధారాలుంటే తనను అరెస్ట్‌ చేసుకోవచ్చని రేవంత్‌ సవాల్‌ విసిరారు. కేసులకు కాంగ్రెస్‌ నేతలు భయపడరు అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక లెక్కకు లెక్క తీర్చుకుంటామని రేవంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణలోని కొందరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారని... కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై విచారణ జరిపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఐపీఎస్ అధికారుల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతల సమస్యను గవర్నర్ నరసింహన్ సమీక్షించాలని విన్నవించారు.

English Title
Revanth Reddy fire on KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES