వైఎస్ తో హ‌రీష్ భేటీ - గుట్టుర‌ట్టు చేసిన రేవంత్

x
Highlights

చచ్చేదాకా టీఆర్ఎస్ లో ఉంటానన్న మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పార్టీ మారుతానని వైఎస్ ను హరీశ్ రావు ...

చచ్చేదాకా టీఆర్ఎస్ లో ఉంటానన్న మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పార్టీ మారుతానని వైఎస్ ను హరీశ్ రావు కలిసింది నిజం కాదా, ఈటెలను ఫ్లోర్ లీడర్ చేయడంతో పార్టీ మారేందుకు హరీశ్ రావు సిద్ధపడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమిత్ షాతో హరీశ్ రావు భేటీ అయింది నిజం కాదా అని నిలదీశారు. కేటీఆర్ ను సీఎంను చేస్తే టీఆర్ఎస్ చీలిపోతుంది అని, చీలిక వర్గానికి హరీశ్ లేదా ఈటెల నాయకత్వం వహిస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పక... టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories