రేవంత్ రెడ్డి అలకవీడారా...గాంధీభవన్‌కు అంటీ ముట్టనట్టుగా ఉన్న రేవంత్‌.. మళ్లీ ....

x
Highlights

రేవంత్ రెడ్డి అలకవీడారా..? నెల రోజులుగా గాంధీభవన్‌కు అంటీ ముట్టనట్టుగా ఉన్న రేవంత్‌.. మళ్లీ హస్తం లీడర్లతో కలిసిపోయారా..? ఫైర్‌ బ్రాండ్.. మళ్లీ...

రేవంత్ రెడ్డి అలకవీడారా..? నెల రోజులుగా గాంధీభవన్‌కు అంటీ ముట్టనట్టుగా ఉన్న రేవంత్‌.. మళ్లీ హస్తం లీడర్లతో కలిసిపోయారా..? ఫైర్‌ బ్రాండ్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చారా..? సంచలన కామెంట్లతో తెరమరుగైన రేవంత్‌కు పీసీసీ పెద్దలతో రాజీ కుదిరిందా..? నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆయన ప్రత్యర్థులపై బౌన్సర్లు వేయడం వెనుక కారణాలేంటి..?

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి మెత్తబడినట్లే కనిపిస్తుంది. కొద్దిరోజుల క్రితం అలకపాన్పు ఎక్కిన ఈ యూత్‌ లీడర్‌ మళ్లీ ఫామ్‌లోకొచ్చినట్లే కనిపిస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసరడంతో మళ్లీ లైమ్‌ లైట్‌లోకొచ్చినట్లు చెబుతున్నారు.

తాను ముఖ్యమంత్రి అభ్యర్థి అని తాను సీఎం అయ్యే అవకాశం ఉందని ఆ వయస్సు కూడా తనకుందంటూ రేవంత్‌ చేసిన కామెంట్లు పార్టీలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మాత్రం తాను కార్యకర్తగానే పనిచేస్తానని కలకలం సృష్టించారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలపై అప్పట్లో సీనియర్లంతా దుమ్మెత్తిపోశారు. తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రేవంత్‌ సైడ్‌ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలతో పాటు జనచైతన్య యాత్రకూ డుమ్మా కొట్టారు.

ఒకానొక సమయంలో కాంగ్రేస్ లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకవర్గానికి రేవంత్ మకాం మార్చారనే చర్చ జరిగింది. ఉత్తమ్ కు వ్యతిరేకంగా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లిన సీనియర్ల వెంట కూడా రేవంత్‌ ఉన్నారని ఉత్తమ్‌కు కొరకరాని కొయ్యగా మారారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అంతేనా రేవంత్ కు ప్రచార కమిటి చైర్మెన్ పదవికి ఉత్తమ్‌ అడ్డుకుంటున్నారనే చర్చ కూడ గాంధీభవన్ లో జరిగింది. దీంతో ఒకానొక దశలో ఉత్తమ్‌ వర్సెస్ రేవంత్‌లా పరిస్థితి మారింది.

అయితే రేవంత్‌ తన వ్యతిరేక వర్గానికి వెళ్లకుండా ఉత్తమ్‌ ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే రేవంత్‌తో ఉత్తమ్‌ గాంధీభవన్‌ సాక్షిగా ఏకాంతంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌కు వెళ్లేముందే వీరి భేటీ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెబుతున్నారు.

ఆ తర్వాతి రోజు నుంచే రేవంత్‌ మళ్లీ యమ యాక్టీవ్‌ గా కనిపించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చాలా రోజుల తరువాత రేవంత్ రెడ్డి మళ్లీ అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ రోజు నుంచే రేవంత్ మంత్రి కేటిఆర్ పై సెటైర్లు విసరడం ప్రారంభించారు. మంత్రి కేటిఆర్ కు సత్తా ఉంటే తనతో టెన్ కే రన్ కు రావాలని సవాలు విసిరారు. పొలిటికల్‌ గేమ్ లో తనతో పోటి పడే వీరుడు తెలంగాణలో ఎవ్వరూ లేరని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాజాగా రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ గేమ్ ఆడుతున్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. తాను రాజకీయాల్లో ఫిట్‌ నెస్‌తో ఉన్నానని తనతో గేమ్‌ ఆడేందుకు కేటీఆర్‌ రావాలని కామెంట్ చేశారు. ఉత్తమ్‌తో చర్చలు సఫలం కావడంతోటే రేవంత్‌ మళ్లీ జోరు పెంచారనే వాదన గాంధీభవన్‌లో వినిపిస్తుంది. ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవికి లైన్ క్లియర్ కావడంతోటే మళ్లీ రేవంత్‌ ఇలా అధికార పార్టీపై బౌన్సర్లు విసురుతున్నారనే చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories