జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా: రేణూ

జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా: రేణూ
x
Highlights

తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని సంభోదిస్తే వారిని సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని నటి రేణూ దేశాయ్‌ సున్నితంగా చెప్పారు. ఆమె...

తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని సంభోదిస్తే వారిని సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని నటి రేణూ దేశాయ్‌ సున్నితంగా చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో అతడు సీరియస్‌గా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. నా త‌న‌యుడు ఈరోపియ‌న్ సినిమాలోని సీరియ‌స్ పాత్ర‌లా కనిపిస్తున్నాడు.. త‌న ల్యాప్‌టాప్‌లో ఓ గేమ్ కోసం తీవ్రంగా వెతుకున్న టైంలో క్లిక్‌మ‌నిపించిన ఫోటో ఇది. ఈ ఫోటోకి ఎవ‌రైన జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ అని కామెంట్ పెడితే వారి పోస్ట్‌ని డిలీట్ చేయ‌డంతో పాటు బ్లాక్ చేయ‌డం జ‌రుగుతుంది. అకీరాని జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అని పిల‌వ‌డం త‌న తండ్రికి కాని, త‌ల్లికి కాని, అకీరాకి కాని అస్స‌లు న‌చ్చ‌దు. ద‌య‌చేసి ఎవ‌రు జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అని పిల‌వొద్దని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది రేణూ.

ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి మిశ్రమ కామెంట్లు వచ్చాయి. ‘తల్లిగా మీ కుమారుడికి నచ్చని దాన్ని వద్దు అని చెప్పడం సరైనదే, ఈ విషయంలో మీకు మద్దతు చెబుతున్నా, అకీరా భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా, అతడికి హీరో కావడం ఇష్టం లేదా?..’ అంటూ కామెంట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories